Tuesday 24 December 2013

Anushka Shetty

Poonam Pandey Hot Christmas Pics :*





పవన్ కళ్యాణ్ ఎంపీ టికెట్ ఖరారైనట్లేనా?


పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రం తప్పదా? గతంలో జరిగిన ప్రచారమే నిజం కానుందా? పవన్ కూడా సైకిలెక్కి 2014 బరిలోకి వెళ్ళనున్నాడా, ఇప్పటికే ఆయనకు టికెట్ కూడా ఖరారు అయిందా? అంటే మాత్రం సోషల్ మీడియాలో కథనాలు, రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం అవుననే చెప్పుకోవాలి. ఆ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ గురించి రకరకాల వాదనలు వినిపించాయి. అయితే పవన్ నోరు మెదపకపోయినా.. కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం వదంతులుగా కొట్టిపారేశాడు.
అయితే ఇప్పుడు మళ్లీ పవన్ రాజకీయ ఎంట్రీ గురించి ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం గతంలో పుకార్లకు తగ్గట్లుగానే ఆయన తెలుగుదేశం తరఫునే బరిలో ఉంటారనేది సమాచారం. అంతేకాదు పవన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీచేస్తారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కనుక ఆ నియోజకవర్గ ముఖచిత్రం మారిపోయే అవకాశం ఉంది. పవన్ దెబ్బతో అక్కడ పోటీ చాలా రసవత్తరంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
 
ఎందుకంటే ఇప్పటికే ఈ నియోజకవర్గంలో వైకాపా నుంచి కేవీపీ వియ్యంకుడు.. పారిశ్రామికవేత్త రఘురామకృష్ణం రాజుకు టికెట్ దాదాపుగా ఖరారై౦ది. అలాగే కాంగ్రెస్ నుంచి సిటింగ్‌ ఎంపీగా కనుమూరి బాపిరాజు రంగంలో ఉన్నారు. అయితే భారీ కేండిడేట్లు రంగంలో ఉన్న ఈ నియోజకవర్గ౦లో బరిలోకి పవన్ కూడా దీగడంతో పోటీ రసవత్తరంగా మారనుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. గతంలో కూడా పవన్ రాజకీయాల గురించి ఇదే తరహా వార్తలు రావడం.. చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారని ప్రచారం జరిగినా పవన్ మాత్రం మౌనంగానే ఉండిపోవడంతో పాటు ఆ మధ్య ఓ నేషనల్ మీడియా అడిగిన 'మీ పొలిటికల్ రీ ఎంట్రీ ఎప్పుడు' అన్న ప్రశ్నకు కూడా పవన్ అసలు నేను రాజకీయాలకు దూరంగా ఉంటే కదా మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి అన్న సమాధానం చెప్పగా ఇప్పుడు ఈ తరహా టికెట్ ఖరారు ప్రచారానికి ప్రాధాన్యత కలుగుతుంది

Kriti, vithika, pranitha stills at kalamandir new shopping mall launch !!















Super :D